వివాదాస్పద బిలియనీర్ ఫైనాన్షియర్ జార్జి సోరస్‌కు అమెరికాలో అత్యుత్తమ పురస్కారమైన ప్రెసిడెంట్ మెడల్ ఆఫ్ ఫ్రీడం ఇవ్వడంపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అసంతృప్తి వ్యక్తంచేశారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మస్క్ మాట్లాడుతూ ‘అతడు మానవ జాతిని ద్వేషిస్తాడు’అని వ్యాఖ్యానించారు.
మరోవైపు రిపబ్లికన్ పార్టీ నేతలు కూడా బైడెన్ సర్కారు నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. జాతీయ విలువలకన్నా రాజకీయ అజెండాకే బైడెన్ ప్రాధాన్యమిచ్చారన్నారు.