అమెరికాను శీతాకాల తుఫాను భయకంపితులను చేస్తోంది. సుమారు 10లక్షల మంది అమెరికన్లు భారీ శీతాకాలపు తుఫానుకు ప్రభావితమయ్యారు. దీని కారణంగా ఈ దశాబ్దంలో అత్యంత భారీ హిమపాతం, అత్యంత శీతల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
మధ్యఅమెరికాను తాకిన ఈ తుఫాను మరో 2రోజుల్లో తూర్పు దిశగా కదులుతుందని నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపింది. ఈ నేపధ్యంలో కెంటకీ, వర్జీనియా రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు.