ఓయో కొత్త చెక్-ఇన్ పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీ ప్రకారం.. ఇకపై పెళ్లికాని జంటలకు రూమ్‌లు ఇచ్చే సదుపాయం ఉండదు. ఈ నిబంధనలు తొలుత ఉత్తరప్రదేశ్‌లోని మీరఠ్ నుంచి ప్రారంభం కానున్నాయి.
ఈ విషయాన్ని కంపెనీ ఆదివారం వెల్లడించింది. మీరఠ్ నుంచి వచ్చే గ్రౌండ్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా కంపెనీ దీన్ని మరిన్ని నగరాలకు విస్తరించే అవకాశం ఉంది.