ఢిల్లీ-మీరట్ నమో భారత్ కారిడార్‌లో సాహిబాబాద్, న్యూ అశోక్ నగర్ మధ్య 13 కిలోమీటర్ల పొడవైన అదనపు విభాగాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు.
ఆ క్రమంలో సాహిబాబాద్ RRTS స్టేషన్ నుంచి న్యూ అశోక్ నగర్ RRTS స్టేషన్ వరకు నమో భారత్ రైలులో ప్రధాని ప్రయాణించారు. ఈ సమయంలో అందులో ఉన్న పాఠశాల విద్యార్థులతో ప్రధాని మోదీ ముచ్చటించారు.