భారత్‌లోకి చొరబాటుదారులు ప్రవేశించేందుకు BSF సాయం చేస్తోందని పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణల్ని బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి ఖండించారు.
ఈ మేరకు ఆయన..మమతకి ఓ లేఖ రాశారు. ‘‘రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉంటాయి. అయితే..భద్రతా బలగాలను అందులోకి లాగడం వారిని అవమానించడమే అవుతోంది.మీ వైఫల్యాలను వారికి ఆపాదించడం నీచ రాజకీయం తప్ప మరొకటి కాదు’’అని లేఖలో పేర్కొన్నారు.