ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ సెంట్రల్ జైల్‌ ని సందర్శించిన హోం మంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 05, 2025, 03:33 PM

రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఆదివారం ఉదయం విశాఖ సెంట్రల్‌ జైల్‌ను సందర్శించారు. జైల్లో ప్రస్తుత పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ.. విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి సరఫరా ఆరోపణలు వచ్చాయని, పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం తప్పిదాల వలనే విశాఖ సెంట్రల్ జైల్లో ఇలాంటి పరిస్థితి వచ్చిందని, ఖైదీల రక్షణే ముఖ్యమని అన్నారు. ఇటీవలే జైల్లో సెల్ ఫోన్లు బయటపడ్డాయని, సెల్ ఫోన్లు బయటపడిన చోట కూడా పరిశీలించామని, విచారణ అనంతరం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఫోన్‌లో ఎవరు ఎవరుతో మాట్లాడారో తెలుసుకుని వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com