కృష్ణా జిల్లా, గన్నవరం, కేసరపల్లి లైలా గ్రీన్ మెడోస్ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించనున్న హైందవ శంఖారావం బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సభకు హిందూ బంధువులు పోటెత్తారు. పలు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ క్రమంలో సభా ప్రాంగణానికి నలువైపులా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయవాడ నుంచి గన్నవరం నాలుగు వైపుల ట్రాఫిక్ మళ్లించారు. ఆలయాల పరిరక్షణ, స్వయం ప్రతిపత్తి కల్పించాలనే డిమాండ్‌తో జాతీయ ఉద్యమం చేపట్టారు. దేశ వ్యాప్త పోరాటానికి విజయవాడ నుంచి ప్రారంభిస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో హైందవ శంఖారావం సభలు నిర్వహించనున్నారు. ఆదివారం జరిగే శంఖారావ సభలో వీహెచ్‌పీ (VHP) జాతీయ ప్రతినిధులు, బీజేపీ నేతలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామీజీలు పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటల తరువాత సభ ప్రారంభం కనుంది.