దేశవ్యాప్తంగా చలి తీవ్రత పెరిపోయింది. ఉత్తరాది రాష్ట్రాలు చలికి వణికిపోతున్నాయి. రికార్డు స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో పరిస్థితి మరింత దిగజారుతోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు కావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పొగమంచు కమ్మేయడంతో పలు విమాన సర్వీసులు ఆలస్యం అవుతున్నాయి. కొన్ని విమాన సర్వీసులను ఆయా యాజమాన్య సంస్థలు రద్దు చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ చలి తీవ్రత బాగా పెరిగిపోయింది. రాత్రి వేళ ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావాలంటేనే బెంబేతెత్తే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నిన్న (శనివారం) నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యా్ప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.కర్నూలులో 16.8 సెల్సియస్ డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, 31.0 సెల్సియస్ డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అనంతపురంలో కనిష్ఠంగా 16.9, గరిష్ఠంగా 30.6 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. శ్రీకాకుళంలో కనిష్ఠంగా 17.0, గరిష్ఠంగా 27.0, కడపలో కనిష్ఠంగా 17.0, గరిష్ఠంగా 29.0, విజయనగరంలో కనిష్ఠంగా 18.0, గరిష్ఠంగా 27.0 సెల్సియస్ డిగ్రీలు నమోదు అయ్యాయి. రాజమహేంద్రవరంలో కనిష్ఠంగా 18.0, గరిష్ఠంగా 33.0, తిరుపతిలో కనిష్ఠంగా 18.2, గరిష్ఠంగా 29.2, విజయవాడలో కనిష్ఠంగా 18.5, గరిష్ఠంగా 28.8, గుంటూరులో కనిష్ఠంగా 19.0, గరిష్ఠంగా 30.0 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. తాడేపల్లిగూడెంలో 19.4, 29.8, నరసాపురంలో 19.4, 30.0, ఒంగోలులో 21.6, 30.8, నెల్లూరులో 21.9, 28.6, విశాఖపట్నంలో 18.0, 28.8 సెల్సియస్ డిగ్రీల కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మరోవైపు హైదరాబాద్ నగరంలో కనిష్ఠంగా 13.2, గరిష్ఠంగా 30.4 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.