విజయవాడ పాయికాపురంలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం సందర్భంగా రమ్య అనే సీనియర్ ఇంటర్ బైపీసీ విద్యార్థిని చెప్పిన సమస్యపై మంత్రి నారా లోకేశ్ వెంటనే స్పందించారు. గంటల వ్యవధిలోనే కార్యరూపం దాల్చింది. కళాశాల వెలుపల రాత్రి వేళ ఇబ్బందులు లేకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. విద్యార్థులకు ఏవైనా సమస్యలు ఉన్నాయేమో కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిందిగా నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబును మంత్రి లోకేష్ ఆదేశించారు. చెప్పిన గంటల వ్యవధిలోనే సమస్య పరిష్కారం కావడంపై పాయకాపురం జూనియర్ కళాశాల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థినుల భద్రత అంశాన్ని మంత్రి లోకేష్ సీరియస్గా తీసుకుని పరిష్కరించారు.