తూర్పు గోదావరి జిల్లా, గోకవరం పరిధిలోని భూపతిపాలెం గురుకుల పాఠశాల సమీపంలో ఉన్న సు మారు 171 ఎకరాల్లో ఎడ్యుకేషనల్ హబ్ ఏర్పా టుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, దీని వల్ల ఐదో తరగతి నుంచి పీజీ వరకు ఒకేచోట విద్య ను అందించనునట్టు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యో తుల నెహ్రూ పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకాన్ని గోకవరం జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే నెహ్రూ ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపం చంలో ప్రతీ ఒక్కరికీ విద్య చాలా అవసరమని, కూటమి ప్రభుత్వం విద్యా విధానంలో పెను మార్పులు తీసుకొచ్చిందన్నారు. విద్యార్థుల ఉత్తీ ర్ణత పెంచేందుకు అధ్యాపకులు కృషి చేయాల న్నారు. రాబోయే రోజుల్లో కళా శాలకు చెందిన ప్రతీ విద్యార్థి 85శాతంతో ఉత్తీర్ణత సాధించా లన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సుంకర శ్రీవల్లి, ఎంపీడీవో గోవిందు, ఎంఈవో గౌరమ్మ, టీడీపీ నాయకులు మంగరౌతు రాము, అడపా భరత్, పాలూ రి బోస్, దాసరి తమ్మన్నదొర, గాజింగం సత్తిబాబు, గళ్లా రాము, బత్తుల సత్తిబాబు, బది రెడ్డి బాబి, బదిరెడ్డి అచ్చ న్నదొర తదితరులు పాల్గొన్నారు.