పేదల విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. కొవ్వూరులోని బాలుర, బాలికల జూనియర్ కళాశాలల్లో శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భో జన పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014-19 కాలంలో సీఎం చంద్రబాబు జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన జగన్‌ప్రభుత్వం ఆ పథకాన్ని నిలుపుదల చేసింది. ఇటీవల కూట మి అధికారంలోకి రావడంతో డొక్కా సీతమ్మ పేరుతో ఈ పథకాన్ని శనివారం రాష్ట్ర వ్యా ప్తంగా ప్రారంభించిందన్నారు. సీఎం చంద్రబాబు పేద విద్యా ర్థుల విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారని, విద్యా ర్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. జూనియర్ కళాశాలల్లో ఖాళీ గా ఉన్న పీడీ నైట్ వాచ్‌మేన్ పోస్టులను భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని బాలుర కళాశాల ప్రిన్సిపాల్ జి.సతీష్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో ద్విసభ్య కమిటీ సభ్యుడు కంటమణి రామకృష్ణారావు, సూరపనేని చిన్ని, సూర్యదేవర రంజిత్, దాయన రామకృష్ణ, కౌన్సిలర్ పాలూరి నీలిమ, పెనుమాక జయరాజు, మద్దిపాటి మురళీ, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జె.సునీత పాల్గొన్నారు.