హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాలకు సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నుంచి కాకినాడ జిల్లాకు 66 బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిలో హైదరాబాద్ నుంచి కాకినాడ డిపోకు 34 బస్సులు, హైదరాబాద్ నుంచి పార్వతీపురం ఒక బస్సు, హైదరాబాద్ నుంచి తుని డిపోకు 18 బస్సులు, హైదరాబాద్ నుంచి ఏలేశ్వరం డిపోకు 13 బస్సులు సంక్రాంతి పండుగ సందర్భంగా తిప్పనున్నారు. డిమాండ్‌ను బట్టి బస్సుల సంఖ్య పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఇతర జిల్లాలకు కూడా బస్సులు నడిపేందుకు ఏర్పాటు చేశారు. కాకినాడ నుంచి విశాఖపట్నం 10 బస్సులు, కాకినాడ నుంచి పలాస ఒక బస్సు, కాకినాడ నుంచి శ్రీకాకుళం మూడు బస్సులు, కాకినాడ నుంచి విజయనగరం మూడు బస్సులు కాకుండా రద్దీ బట్టి బస్సులు ఏర్పాటుచేయనున్నారు.