కోటబొమ్మాళి పరిధిలోని హరిశ్చంద్రపురం రైల్వే ఫ్లై ఓవర్ సమీపంలో శనివారం జరిగిన రైలు ప్రమాదంలో పాతపట్నం మండలం సీది పంచాయతీ తీమర గ్రామానికి చెందిన ఎందవ రామారావు తీవ్రంగా గాయపడ్డాడు. వివరా లిలా ఉన్నాయి.. హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఏజెంట్‌గా పనిచేస్తు న్న రామారావు ఆదివారం వారి స్వగ్రామంలో జరిగే ఒక కార్యక్రమానికి హాజ రయ్యేందుకు విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చాడు. ఇతడు తిలారులో దిగాల్సి ఉండ గా అదమరిచి స్టేషన్‌లో దిగలేదు.. ఎక్కడ దిగాలో ఆలోచిస్తున్న తరుణంలో హరిశ్చంద్రపురం రైలు నిలయం వద్ద రైల్వే పనులు సిబ్బంది చేస్తుండగా రైలు నెమ్మదిగా వెళుతున్నట్లు గుర్తించి రామారావు రైలు దిగే క్రమంలో కిందపడి పోవడంతో తీవ్ర గాయాలయ్యాయి అక్కడ పనులు చేస్తున్న సిబ్బం ది 108కు సమాచారం ఇవ్వడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.