మదనపల్లె పరిధిలోని రామసముద్రం మండలం మాలే నత్తం గ్రామ పంచాయతీ కొండూరు గ్రామంలో అంగనవాడీ కార్యకర్తగా విధు లు నిర్వహిస్తున్న లావణ్య(32) ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అంగన్వాడీ సూపర్‌వైజర్ వేధింపులు తాళలేక ఆత్మ హత్యాయత్నానికి పాల్పడినట్లు ఆమె పేర్కొన్నారు. ప్రతి చిన్న విషయంపై తనను సూపర్‌వైజర్ వేధిస్తోందని, పలు మార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా సూపర్‌వైజర్‌పై చర్యలు తీసుకోలే దని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా బాధితురాలు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.రామసము ద్రం మండలం కొండూరు అంగనవాడీ కార్యకర్త ఆత్మ హత్యాయత్నానికి కారణమై న సూపర్‌వైజర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని సీఐటీ యూ నాయకుడు పి.శ్రీనివా సులు, అంగనవాడీ అసోసియే షన నాయకులు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక సబ్‌కలెక్టరేట్ ఎదుట అంగనవాడీలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడు తూ అంగనవాడీ కార్యకర్త లావణ్యను సూపర్‌వైజర్ ఆకారణంగా మానసిక వేధనకు గురిచేశారని ఈ క్షోభ భరించలేక ఆత్మహత్యకు యత్నించిందన్నారు. దీనిపై ఉన్నతాధికారులు విచారించి సూపర్‌వైజర్‌పై కఠిన చర్యలు తీసుకోవా లని డిమాండ్ చేశారు. అనంతరం సబ్‌కలెక్టరేట్ డీఏవోకు వినతి పత్రం అం దజేశారు. కార్యక్రమంలో అంగనవాడీ అసోసియేషన నాయకురాళ్లు రాజేశ్వరి, మధురవాణి, గంగాదేవి, రాధిక, విజయ, మధుమతి తదితరులు పాల్గొన్నారు.