ఈనెల 13, 14, 15తేదీల్లో పెద అవుటపల్లిలో నిర్వహించే బ్రదర్ జోసఫ్ తంబి 80వ వర్ధంతి తిరునాళ్లను పురస్కరించుకుని శనివారం తంబి పుణ్యక్షేత్రంలో నవదిన ప్రార్థనలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సాయంత్రం 5.30 గంటలకు వికార్ ఫోరిన్ గన్నవరం ఆర్సీఎం చర్చి గురువు రెవరెండ్ ఫాదర్ పసల థామస్ నేతృత్వంలో ఫాదర్లు, విశ్వాసులు ముందుగా తంబి చిత్రపటం, పతాకాన్ని పుణ్యక్షేత్ర ప్రాంగణంలో ఊరేగించారు. తంబి సమాధి వద్ద పతాకావిష్కరణ చేసి, నవదిన ప్రార్థనలకు అంకురార్పణ చేశారు. జపమాల, దివ్యబలిపూజలను ఫాదర్ థామస్ సమర్పించారు. మొదటి రోజు ప్రా ర్థనలను లూర్థునగర్ వాసులు చేశారు. ప్రత్యేకమైన కానుకలను సమర్పించారు. తంబి పుణ్యక్షేత్రం రెక్టర్ రెవరెండ్ ఫాదర్ పాలడుగు జోసఫ్ విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ అభిలాష్, సహాయక గురువులు పాల్గొన్నారు.