ఏలూరు జిల్లా నూజివీడు మండలం మర్రిబంధం గ్రామంలో రోజుకు రోజుకు లేడీ రౌడీ షీటర్ దావులూరి ప్రభావతి ఆగడాలు పేట్రేగిపోతున్నాయి.గ్రామానికి చెందిన దోనపల్లి వెంకట్రావు గత కొంతకాలంలో లేడీ షీటర్ చేస్తున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ వస్తున్నాడు. ఆమె ఆగడాలపై వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. దీంతో వెంకట్రావును ఎలాగైనా భయపెట్టాలని భావించిన పద్మావతి సమయం కోసం ఎదురు చూసింది. ఈ క్రమంలో ఒంటరిగా ఉన్న వెంకట్రావును ప్రభావతి, ఆమె అనుచరులు పట్టుకున్నారు. కొంతకాలంగా తన మాట వినకుండా గ్రామ కార్యక్రమాల్లో వ్యతిరేకంగా ప్రవర్తిస్తూడన్న కోపంతో వెంకట్రావును వాటర్ ట్యాంక్ స్థంభంకు కట్టేసి.. ఆపై దాడి చేశారు. గతంలో ప్రభావతి బ్యాంకు మేనేజర్ విధులు నిర్వహించారు. అయితే ఆ వృత్తిలో ఉంటూ అవినీతి ఆరోపణలకు పాల్పడటంతో ప్రభావతిని అధికారులు సస్పెండ్ చేశారు.అలాగే ప్రభావతిపై పలు ప్రాంతాల్లో అధిక స్థాయిలో కేసులు నమోదు కావడంతో ఆమెపై నూజివీడు సర్కిల్ పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. అయితే వెంకట్రావును స్తంభానికి కట్టేసి తీవ్రంగా గాయపరచారు పద్మావతి, ఆమె అనుచరులు. తీవ్ర గాయాలతో అరుపులు, కేకలు పెడుతున్న బాధితుడు వెంకట్రావును గమనించిన గ్రామస్తులు... పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వెంకట్రావును అక్కడి నుంచి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పాత గొడవల నేపథ్యంలో తనపై ప్రభావతి అనుచరవర్గం దాడి చేసి హత్య చేసేందుకు కుట్ర పన్నారని పోలీసులకు బాధితుడు వివరణ ఇచ్చాడు. వెంటనే వెంకట్రావును నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు విషయం తెలిసిన జనసేన పార్టీ నేతలు.. ఏలూరు ఆస్పత్రికి వచ్చి బాధితుడిని పరామర్శించారు.