ఓర్వకల్లులోని ప్రధాన రహదారి పక్కన ఉన్న మద్యం షాపును తొలగించాలని సోమవారం సీపీఎం, సీపీఐ మండల కార్యదర్శులు నాగన్న, రమేష్ డిమాండ్ చేశారు. సోమవారం మద్యం షాపు ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓర్వకల్లులో ప్రధాన రహదారి పక్కన్న మద్యం షాపు ఏర్పాటు చేశారని, దీంతో ప్రజలు, మహిళలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం షాపు మిడ్తూరు ప్రధాన రహదారిలో ఉండటంతో సాయంత్రం రోడ్డుపై వాహ నాలు నిలపడం, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు తప్పతాగి గొడవలు పడుతుండటం, రోడ్డు పక్కనే మూత్రవిసర్జనలు వంటి పనులు చేస్తున్నారన్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఓర్వ కల్లులోని మ్యదం పాపును తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.