బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా వీసాను భారత్ పొడిగించింది. భారత్‌లో తలదాచుకుంటున్న ఆమెను అప్పగించాలని బంగ్లాదేశ్ కోరుతున్న నేపథ్యంలో భారత్ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. జులైలో జరిగిన హత్యలు, కొందరి అదృశ్యాలకు మాజీ ప్రధాని షేక్ హసీనా, మరో 96 మంది కారణమని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం ఆరోపించింది. బంగ్లాదేశ్‌కు చెందిన అంతర్జాతీయ నేర న్యాయస్థానం ఇప్పటికే హసీనాపై అరెస్టు వారెంట్లు జారీ చేసింది.