నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూములను పున: పరిశీలన చేయాలని సి సి ఎల్ ఎ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం వీక్షణ సమావేశం నిర్వహించారు. జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ వెంకట మురళి, సంయుక్త కలెక్టర్ ప్రకార్ జైన్ హాజరయ్యారు. నిషేధిత భూముల జాబితాలో నుంచి తొలగించిన భూములు చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ అయ్యాయా లేదా పరిశీలించాలని జయలక్ష్మి తెలిపారు.