పెళ్లి రిసెప్షన్‌లో అతిథుల కోసం సిద్ధం చేసిన వంటకాల్లో ఓ వ్యక్తి విషం కలిపాడు. తన ఇంట్లోనే పెరిగిన మేనకోడలు.. తనకు ఇష్టం లేని వివాహం చేసుకుందనే ఆగ్రహంతో ఈ పని చేశాడు.
మహారాష్ట్రలోని కొల్హాపుర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఆ ఆహార పదార్థాలను ఎవరూ తినలేదని, ఘటనానంతరం నిందితుడు తప్పించుకున్నాడని పోలీసుల వెల్లడించారు.