ప్రధాని నరేంద్ర మోదీ మరికాసేపట్లో విశాఖకు చేరుకోనున్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా సిరిపురం కూడలికి చేరుకోనున్నా మోదీ.సిరిపురం కూడలి సమీపంలోని వెంకటాద్రి వంటిల్లు నుంచి ఏయూ ఇంజనీరింగ్ కళాశాల వరకు ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించనున్నారు. ప్రధాని మోదీతోపాటు సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోడ్డు షోలో పాల్గొననున్నారు. కాగా ప్రధాని మోదీ రోడ్డు షో కు, బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. చరిత్రలో గుర్తుండిపోయేలా ప్రధానికి ఘనంగా స్వాగతం పలకాలని కూటమి నేతలు ఏర్పాట్లు చేశారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలు ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.