తనను తానే కిడ్నాప్ చేసుకొని సోదరుడిని రూ.50 వేలు డిమాండ్ చేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని హర్దోయీజిల్లాలో జరిగింది. సందీప్(27) అనే యువకుడు కిడ్నాపైనట్లు నాటకమాడి.. వేరే నెంబర్ నుంచి డబ్బులు ఇవ్వాలని మేసేజ్చేశాడు.
అందులో డెత్(DETH) అని రాశాడు. ఫోన్‌సిగ్నల్ ఆధారంగా సందీప్‌ను గుర్తించినవారు.. అనుమానంతో డెత్ అని రాయమని కోరారు. తప్పుగా రాయడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో విషయం బయటపడింది.