కేసుల సత్వర విచారణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ‘భారత్ పోల్’ పోర్టల్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రారంభించారు. ‘‘కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన దర్యాప్తు సంస్థలు ఇంటర్‌పోల్‌తో సులువుగా కనెక్ట్ అయ్యేందుకు ఇది వీలు కల్పిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న సవాళ్లను గమనించి, మన వ్యవస్థల్లో మార్పులు చేసుకోవాల్సిన, ఆధునిక సాంకేతికతలను ఉపయోగించాల్సిన సమయం ఇది. ఆ దిశగా భారత్‌పోల్ అనేది ఒక అడుగు’’అని తెలిపారు.