చలిమంట ఒక దివ్యాంగుడి ప్రాణాలు తీసింది. పోలీసుల కథనం ప్రకారం. నల్లజర్ల కోనేరు కాలనీకి చెందిన దానియేలు (24) నూనె ప్యాకెట్లు విక్రయించే దుకాణంలో పనిచేస్తుంటాడు.ఆదివారం రాత్రి భోజ నం అనంతరం తాటాకు ఇంటిలో నిద్రకు ఉపక్రమించాడు.ఆ ఇంటి సమీపంలో దానియేలు తండ్రి రామకృష్ణ చలిమంట వేసుకుని కాసేపు కాగాడు.. ఆ తరువాత నిప్పు అర్పకుండా ఆరుబయట నిద్రపోయాడు.కాసేపటి తర్వాత చలిమంట నిప్పురవ్వలు తాటికిల్లుకు అంటు కుని మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ద మైంది.స్థానికులు గమనించి రామకృష్ణను బయటకు తీసుకురాగా దివ్యాం గుడు దానియేలు మంటల్లో సజీవదహనమయ్యాడు.మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఆసుప త్రికి తరలించారు.కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ శోభనాద్రి తెలిపారు