తిరుపతిలోని ఎనిమిది కేంద్రాల్లోని 94 కౌంటర్లలో 9న ఉదయం 5 గంటల నుంచి 1.20 లక్షల ఎస్డీ టోకెన్లను భక్తులకు జారీ చేస్తామని వెల్లడించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 10 రోజుల పాటు టికెట్స్, టోకెన్స్ ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామన్నారు. 9న ఎస్డీ టోకెన్స్ జారీని రద్దు చేశామని ఈవో తెలిపారు. కాలినడక భక్తులకు జారీ చేసే దివ్యదర్శనం టోకెన్స్ కూడా రద్దు చేశామన్నారు. తిరుమల్లోని వివిధ ప్రదేశాల్లో 12 వేల వాహనలు పార్కింగ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేశామని తెలిపారు. మూడు వేల మంది పోలీసులు, 1500 మంది విజిలెన్స్ సిబ్బందితో బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అన్నప్రసాద సముదాయంలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అన్నప్రసాద వితరణ చేస్తామన్నారు. మూడు వేల మంది శ్రీవారి సేవకుల సేవలను వినియోగిస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు.