అరకు ఉత్సవ్‌ను ఈ నెల 31, ఫిబ్రవరి 1, 2 తేదీల్లో నిర్వహించాలని కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్ణయించామని, దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపామని ఐటీడీఏ పీవో అభిషేక్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉత్సవ్ నిర్వహణకు అనుమతి, నిధులు మంజూరుపై ఆమోదం రావలసి ఉందన్నారు. దీనిపై త్వరలోనే పూర్తి స్థాయి వివరాలను మీడియాకు వెల్లడిస్తామన్నారు. కాగా పద్మాపురం గార్డెన్‌ను కోటి రూపాయల వ్యయంతో ఆధునికీకరిస్తున్నామని, పనులు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నామని ఆయన చెప్పారు. ఆయన వెంట జేసీ అభిషేక్ గౌడ, తహసీల్దార్ ఎంవీఎస్ ప్రసాద్, సీఐ హిమగిరి, ఐటీడీఏ టూరిజం ఆఫీసర్ మురళి, మ్యూజియం మేనేజర్ గణపతి, తదితరులు ఉన్నారు.