బాలికలు, మహిళల ఉజ్వల్ భవిష్యత్తుకు కిశోరి వికాసం కార్యక్రమం ఎంతోగానో దోహపడుతుందని ఐసీడీఎస్‌ఐ పీడీ వనజాక్కమ్మ పేర్కొన్నారు. గార్లదిన్నెలో కిశోరి వికాసం ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ పీడీ వనజా అక్కమ్మ ముఖ్య అథితులుగా హజరైమాట్లాడారు. అడపిల్లల ఉజ్వలమైన, ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు కిశోరి వికాసం కార్యక్రమం పున:ప్రారంభం పునాది వేస్తుందన్నారు. ముఖ్యంగా బాలికలు ఎదుర్కొనే ఇబ్బందులు, బాల్య వివాహాల నివారణ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. బడిమానేసిన పిల్లలను బడిలో చేర్పించాలని తెలిపారు. ఈఓఆర్డీ దామోదరమ్మ, ఎంఈఓ మల్లికార్జుననాయక్, సీడీపీఓ ఉమా శంకరమ్మ, ఏపీఎం మల్లికార్జున, ఆర్‌డబ్ల్యూఎస్ మండల కోఆర్డినేటర్ అనురాధ, ఐసీడీఎస్‌ఐ సూపర్ వైజర్లు జ్యోతి, వాణిశ్రీ, వీఆర్వోలు, వెలుగు సీసీలు, ఆంగనవాడీ వర్కర్లు, ఆయాలు, ఏఎనఎంలు పాల్గొన్నారు.