కరువు బృందం పర్యటించనున్న నేపథ్యంలో పంటనష్ట వివరాలను స్పష్టంగా తెలియజేయాలని, అందుకు అధికారులు కార్యాలయాలు వదలి పొలాలవైపు చూడాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. కనగానపల్లి మండలంలోని తల్లిమడుగుల గ్రామం లో హాంద్రీనీవా కాలువ పరిదిలో రైతులు సాగుచేసిన వేరుశనగ పంటను ఎమ్మెల్యే సోమవారం పరిశీలించారు. పంట పచ్చగా ఉన్నా తెగుళ్లు కారణంగా దిగుబడి తగ్గిందని, కనీసం పెట్టుబడులు వచ్చేట్టు కనిపించ డంలేదని రైతులు రామాంజినేయలు, సుబ్బయ్య, సూర్యనారాయణ, సరస్వతి ఎమ్మెల్యేకి వివరించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు సలహాలు, సూచనలు అందించాలని ఎమ్మెల్యే తెలిపారు. పం టనష్టాన్ని అధికారులు కరువు బృందానికి తెలిపి రైతులను ఆదుకోవా లన్నారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ రామాంజినేయలు, అంజి, మనోహర నాయుడు, ఆనంద్, కిష్టయ్య, ముత్యాలు, అశ్వత్థ తదితరులు ఉన్నారు.