యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాను పురస్కరించుకుని అతి పెద్ద యజ్ఞకుండాన్ని నిర్మిస్తున్నారు. ఈ మండపంలో 324 యజ్ఞకుండాలు, పైన 9 శిఖరాలు ఉన్నాయి.
ఒకేసారి 1100 మంది యజ్ఞ క్రతువును నిర్వహించేలా ఏర్పాటు చేశారు. జగద్గురు శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి ఆధ్వర్యంలో రోజుకు 9 గంటల పాటు యాగ క్రతువు జరగనుంది. గోవుకు ‘రాష్ట్ర మాత’ హోదాను ఇవ్వాలన్న డిమాండ్‌తో ఇక్కడ నెల రోజులపాటు యాగం నిర్వహించనున్నారు.