గత వైసీపీ పాలనలో కొత్తపేట నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలు, దోపిడీల్లో పీహెచ్‌డీ చేసిన మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గురించి మాట్లాడాలంటే మాటలే సరిపోవని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందించడాన్ని ఓర్వలేక జగ్గిరెడ్డి విమర్శలు చేస్తున్నారన్నారు. ఉచిత ఇసుక పేరిట అన్నదమ్ములు దోపిడీకి పాల్పడుతున్నారు అనడాన్ని ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఆహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించేస్థాయి జగ్గిరెడ్డికి లేదన్నారు. ఇప్పటికైనా తప్పుడు ఆరోపణలు మానుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు చిలువూరి సతీష్‌రాజు, గుత్తుల పట్టాభిరామారావు, కరుటూరి నరసింహారావు, కంఠంశెట్టి శ్రీనివాస్, ధర్నాల రామకృష్ణ, జక్కంపూడి వెంకటస్వామి, ముత్యాల బాబ్జి, కేతా శ్రీను, సిద్దిరెడ్డి శ్రీను, కూటమి నాయకులు పాల్గొన్నారు.