దేశీయంగా ఆటో మొబైల్ రిటైల్ అమ్మకాల్లో మెరుగైన వృద్ధి నమోదైంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2024లో 9%మేర విక్రయాలు పెరిగాయి. ఓవైపు ప్రతికూలతలు ఉన్నా.. టూవీలర్.
పాసింజర్ వాహనాలకు ఉన్న డిమాండ్ కారణంగా మెరుగైన వృద్ధి నమోదైనట్లు ఆటోమొబైల్ డీలర్స్ సమాఖ్య ఫాడా(FADA) వెల్లడించింది. ఈమేరకు గతేడాదికి సంబంధించిన డేటాను విడుదల చేసింది. 2024లో 2,61,07,679యూనిట్ల మేర అమ్మకాలు నమోదైనట్లు ఫాడా తెలిపింది.