విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో త్వరలోనే పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించనున్నట్లు ఏపీ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి దుర్గేశ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల విజయవాడ వివంత హోటల్‌లో నిర్వహించిన ఇన్వెస్టర్ల సమ్మిట్ చర్చకు వచ్చింది. దీంతో ఆ సమ్మిట్‌లో వచ్చిన ప్రతిపాదనలపై అధికారులతో మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. ప్రతిపాదనల సాధ్యాసాధ్యాలను పరిశీలించి త్వరగా వాటిని పట్టాలెక్కించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.