ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘ ఈ ఏడాది తొలి ఎన్నికలు ఢిల్లీలో జరుగుతున్నాయి.
ఈవీఎంలపై అధారాల్లేని ఆరోపణలు చేశారు. ఈవీఎంను ట్యాంపరింగ్ చేయడం సాధ్యపడదు. ఈవీఎంలను ఎవరూ ట్యాంపరింగ్ చేయలేరు. ఢిల్లీలో ఓటర్ల ట్యాంపరింగ్ ఆరోపణలను ఖండిస్తున్నాం’’ అని తెలిపారు.