బోర్డర్ గవాస్కర్‌ట్రోఫీలో టీమ్‌ఇండియాకు చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షమి గురించి సరైన సమాచారం ఎందుకు బయటకు రాలేదని మాజీకోచ్ రవిశాస్త్రి ప్రశ్నించాడు.
స్టార్ ఆటగాళ్లు విఫలమవడం, మిడిలార్డర్ నిలకడ లేమి, బుమ్రాకు ఇతర బౌలర్ల నుంచి సరైన సహకారం అందకపోవడం భారత్‌ను దెబ్బతీశాయన్నాడు. అనుభవజ్ఞుడైన షమిని ఆస్ట్రేలియాకు తీసుకెళ్లి ఉంటే భారత జట్టు బలంగా ఉండేదని అభిప్రాయపడ్డాడు.