ఢిల్లీ ప్రజలు అభివృద్ధి వైపే చూస్తారని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ విజయం ఖాయమని మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు అభివృద్ధికి, అధికార దుర్వినియోగానికి మధ్య జరుగుతున్న పోరు అన్నారు. నేడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ ఎన్నికల తేదీలు వచ్చాయని పార్టీ శ్రేణులు పూర్తి సామర్థ్యంతో ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.పదేళ్లలో ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన అభివృద్ధి పట్ల ఓటర్లు పూర్తి విశ్వాసంతో ఉన్నారని వ్యాఖ్యానించారు. అందుకే వారు తమ పార్టీ వైపే చూస్తారని భావిస్తున్నామన్నారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలే తమ బలమన్నారు. కార్యకర్తల బలం ముందు ప్రతిపక్ష వ్యవస్థలన్నీ విఫలమవుతాయన్నారు