మెటాలో సెన్సార్షిప్ విధానాలను సవరించినట్లు సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. ఫ్యాక్ట్చెకర్లను తొలగించినట్లు తెలిపారు. ‘‘సెన్సార్షిప్ అధికస్థాయిలో ఉన్న పరిస్థితికి చేరుకున్నాం.
ప్రస్తుతం మేం మా తప్పులను తగ్గించుకోవడంపై దృష్టిపెడతాం. మా విధానాలను సరళీకరించి, మా ప్లాట్‌ఫాంలలో స్వేచ్ఛా వ్యక్తీకరణ పునరుద్ధరించే దిశగా చర్యలు తీసుకుంటాం’’అని పేర్కొన్నారు. త్వరలో అమెరికా పగ్గాలు చేపట్టబోతున్న ట్రంప్ యంత్రాంగానికి అనుకూలంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.