భారత్లో యుద్ధ విమానాల తయారీ అత్యంత నెమ్మదిగా జరుగుతోందని ఐఏఎఫ్ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సాంకేతికతను ఆలస్యం చేయడం అంటే దాన్ని తిరస్కరించడంతో సమానమని పేర్కొన్నారు.
భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచంలో గుర్తింపు పొందాలంటే వైమానిక రంగంలో అభివృద్ధి అత్యంత కీలకమని ఓ సెమినార్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.