AP: విశాఖకు రానున్న ప్రధాని మోదీతో రాష్ట్ర విభజన హామీలు, ప్రత్యేక హోదాలపై ప్రకటనలు చేయించండని సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కోరారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని మోదీతో చెప్పించాలని ఎక్స్ వేదికగా బుధవారం డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రధాని మోదీ కోసం ఎదురు చూస్తుంటే.. ఆయన ఇచ్చిన వాగ్ధానాల కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు.