మహారాష్ట్రలోని ప్రజలు వింత సమస్యను ఎదుర్కొంటున్నారు. బుల్దానా జిల్లాలోని మూడు గ్రామాల్లోని ప్రజలకు హఠాత్తుగా జుట్టు రాలుతోంది. గత కొన్ని రోజులుగా ప్రజలందరీ జుట్టు రాలిపోతోంది. దీంతో అక్కడి ప్రజల్లో భయం నెలకొంది. అయితే, ఇలా జుట్టు రాలిపోవడానికి నీటి కాలుష్యమే కారణమని ఆరోగ్య శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ప్రాంతంలోని నీటి శాంపిల్స్, గ్రామస్థుల నుంచి జుట్టు, చర్మ నమూనాలను పరీక్షల కోసం తీసుకెళ్లారు.