ఇవాళ సీఎం చంద్రబాబు తిరుపతికి వెళ్లనున్నారు. మ.12 గంటలకు తిరుపతికి చేరుకోనున్న చంద్రబాబు.. రుయా, స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు. అనంతరం టీటీడీ ఈవో, అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు.ఏటా వైకుంఠ ద్వార దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలి వస్తారు. సంక్రాంతి సమయంలో వచ్చే వైకుంఠ ద్వార దర్శనాల కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు. ఈ క్రమంలో టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. అయితే టోకెన్ల జారీ కేంద్రాల్లోకి భక్తులను అనుమతించే సమయంలో పోలీసులు, టీటీడీ అధికారుల మధ్య సమన్వయం లోపించింది. టోకెన్ల జారీకి 24 గంటలకు ముందే భక్తులు పెద్ద సంఖ్యలో తిరుపతి చేరుకున్నా టీటీడీ, పోలీస్ సిబ్బంది అప్రమత్తం కాలేదు. ముఖ్యంగా టోకెన్ జారీ కేంద్రాల్లోకి భక్తుల్ని అనుమతించే సమయంలో సమన్వయం లోపించింది. గంటల తరబడి ఎదురు చూసిన భక్తులు గేట్లు తెరిచిన వెంటనే భక్తులు పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఆరుగురు మృతి చెందడంతోపాటు మరో 48 మంది భక్తులకు గాయాలయ్యాయి. వారికి రుయా, స్విమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స అందించారు. ఆసుపత్రుల వద్ద అంబులెన్సుల మోత, క్షతగాత్రుల బంధువుల రోదనలతో రుయా హాస్పిటల్ ప్రాంగణం వద్ద దయనీయ పరిస్థితి నెలకొంది. రుయా ఆస్పత్రికి కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ ఈవో శ్యామలరావు చేరుకొని వైద్యసేవలను పర్యవేక్షిస్తున్నారు.