మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించిన తర్వాత రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనకు వెళ్లడంపై ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్ట ముఖర్జీ రాహుల్ గాంధీ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. ‘ప్రధానిగా పనిచేసిన వ్యక్తి మరణించి దేశం మొత్తం శోకసంద్రంలో ఉంటే అతను న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వేరే ప్రాంతానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది..? ఎందుకు వేచి ఉండలేకపోయారు..?’ అని జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించారు.