అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేటలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో బల్క్ డ్రగ్ పార్కును ఏర్పాటుచేస్తున్నారు. సుమారు 1500 ఎకరాల్లో ఏర్పాటుచేయనున్న ఈ బల్క్ డ్రగ్ పార్కుకు ఈరోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం నుంచి వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. అయితే, రాజయ్యపేటలో డ్రగ్ పార్క్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ సీపీఎం నాయకులు, స్థానిక మత్స్యకారులు గత కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం రాజయ్యపేటలో సీపీఎం ఆధ్వర్యంలో మత్స్యకారులు నిరసనకు దిగారు. బల్క్ డ్రగ్ పార్క్ వర్చువల్ శంకుస్థాపన ఆపాలని డిమాండ్ చేశారు. అయితే, నిరసన చేస్తున్న సీపీఎం నాయకులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో పోలీసులపై స్థానిక మత్స్యకార మహిళలు తిరగబడ్డారు.