ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళాకు హిందూ సంప్రదాయంలో ఓ ప్రత్యేకత ఉంది. ఎంతో ఘనంగా ఈ మహా కుంభమేళాను నిర్వహిస్తారు. అయితే ఈ మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభం కానుంది.ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్లోని 'సంగం' ఒడ్డున జరగనున్న కుంభమేళాకు లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ కుంభమేళాకు యాపిల్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ జాబ్స్ కూడా రానున్నట్లు తెలుస్తోంది. ఈ మహా కుంభమేళాకు వచ్చి దాదాపుగా రెండు వారాల పాటు తపస్సు చేయనున్నట్లు సమాచారం. లారెన్ పావెల్ జనవరి 13న కుంభమేళాకు రానున్నారు. అక్కడ నిరంజనీ అఖారాలోని మహమ్నాద్లేశ్వర్ స్వామి కలియశానంద శిబిరంలో బస చేయనున్నారు.