ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా పిఠాపురం మండలం కుమారపురంలో కృష్ణుడి ఆలయం వద్ద నిర్మించిన మినీ గోకులంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 12,500 మినీ గోకులం షెడ్లను ఇక్కడి నుంచి లాంఛనంగా ప్రారంభించారు.కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కలెక్టర్ షాన్‌మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.పిఠాపురం మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన సభకు పవన్ కల్యాణ్ హాజరయ్యారు. శనివారం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. గ్రీన్‌కో రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టును పరిశీలించనున్నారు.