ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. పూర్వంచల్ ప్రజలపై కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో పూర్వాంచల్ సమ్మాన్ మార్చ్ పేరుతో ర్యాలీ నిర్వహించారు.
ఈక్రమంలోనే ఫిరోజ్‌షా రోడ్డులోని కేజ్రీవాల్ ఇంటి వద్దకు చేరుకున్న బీజేపీ వాదులు..పూర్వాంచల్ వాసులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులకు, బీజేపీ శ్రేణులకు మధ్య వాగ్వాదంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.