ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం విజయవాడ రీజనల్ పాస్ పోర్ట్ కార్యాలయానికి వెళ్లనున్నారు. దావోస్ వెళుతున్న నేపథ్యంలో డిప్లొమాటిక్ పాస్ పోర్ట్ తీసుకోనున్నారు.11 గంటలకు ఉండవల్లిలోని తన ఇంటి నుంచి బయల్దేరి 11.10 బందర్ రోడ్‌లోని ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయానికి వెళతాను. అనంతరం అక్కడనుంచి తిరిగి ఉండవల్లి చేరుకుని హెలికాప్టర్లో గుంటూరు పర్యటనకు వెళతారు. 12.05 గంటలకు చేబ్రోలు హనుమయ్య కంపెనీ వద్ద ఏర్పాటు చేసిన నరెడ్కో ప్రాపర్టీ ప్రదర్శనను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.05 గంటలకు తిరుగు ప్రయాణమై వెలగపూడిలోని సచివాలయానికి వస్తారు. అక్కడ విజయవాడ వెస్ట్రన్ బైపాస్‌పై అధికారులతో సమీక్ష జరుపుతారు. సాయంత్రం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై సీఎం చంద్రబాబు సమీక్షిస్తారు.