వైకుంఠ ద్వారా దర్శనం కోసం ఈ నెల 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం జారీ చేసిన ఎస్డి టోకెన్స్ కోటా పూర్తి అయింది. మూడు రోజులకు సంబంధించి లక్షా 20 వేల టోకెన్స్‌ని టీటీడీ అధికారులు జారీ చేశారు. దాదాపు 13 గంటల పాటు 9 కేంద్రాల్లో భక్తులకు టోకెన్స్ జారీ చేశారు. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచే మిగిలిన రోజులకు సంబంధించిన టోకెన్స్‌ను ఏ రోజుకు.. ఆ రోజూ జారీ చేయనున్నారు. 13 వ తేదీ ఉదయం తిరుపతిలోని భూదేవి, కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలో నిత్యం 40 వేల టోకెన్స్‌ను టీటీడీ అధికారులు జారీ చేయనున్నారు. 19 వ తేదీ వరకు వైకుంఠ ద్వారా దర్శనం కోసం ఎస్డి టోకెన్స్‌ను జారీ చేయనున్నారు. బుధవారం ఘటన నేపథ్యంలో టోకెన్స్ జారీ చేసే కేంద్రాల వద్ద పటిష్టమైన క్యూ లైన్లను ఏర్పాటు చేయనున్నారు. టీటీడీ విజిలెన్స్‌తో పాటు పోలీసులతో గట్టి బందోబస్త్ ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేకంగా నియమించనున్న సీనియర్ అధికారుల పర్యవేక్షణలో టోకెన్స్‌ను టీటీడీ జారీ చేయనుంది.