విజయవాడ నగర పరిధిలో ఖాళీ స్థలాల పన్నులు చెల్లించని యాజమానులపై చర్యలకు నగరపాలక సంస్థ సిద్ధమైంది. కమిషనర్ ఆదేశాలమేరకు గురువారం ఖాళీస్థలాలలో వీఎంసీ రెవెన్యూ సిబ్బంది నోటీసు బోర్డులు ఏర్పాటు చేశారు. 15రోజుల్లో బకాయి చెల్లించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటా మన్నారు. ఖాళీస్థలాలలో బోర్డులు ఏర్పాటు చేసి నోటీస్ బోర్డులు పెట్టారు. కొన్ని సంవత్సరాలుగా నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన ఖాళీస్థలాల పన్నులు ఆయా యాజమానులు చెల్లించకపోవడంతోపాటు కొన్ని స్థలాలకు సంబంధించి యాజమానులు సమాచారం లేకపోవడం ఖాళీస్థలాల బకాయి పెరిగాయి. మొదటి విడతగా పలుప్రాంతాల్లో నోటీసు బోర్డులు సచివాలయాల రెవెన్యూ సెక్రటరీలు ఏర్పాటు చేశారు. విధ్యాధరపురం, దావుబుచ్చయ్యకాలనీ, రామకృష్ణపురం, సింగ్‌నగర్, పాయకాపురం, గుణదల, కరెన్సీనగర్, పటమటలోని ఖాళీ స్థలాల్లో ఈ బోర్డులను ఏర్పాటు చేశారు. అలాగే ఆస్తి పన్ను, నీటి పన్ను, డ్రైయినేజి చార్జీలు పెద్ద మొత్తంలో బకాయి ఉన్నవారికి నీటి, డ్రెయినేజీ సర్వీసులు నిలుపుదల చేయుటకు నోటీ సులు జారీచేశారు. నోటీసులు అందుకున్న 24గంటలలోపు పన్నులు చెల్లించకుంటే చర్యలు తీసుకుంటామని సిబ్బంది తెలిపారు.