కొన ఊపిరితో ఉన్న తల్లిని కలిసేందుకు డెల్టా ఎయిర్‌లైన్స్‌లో హన్నా వైట్ అనే మహిళ టికెట్ బుక్ చేసుకుంది. విమానం గంటపాటు ఆలస్యం కావడంతో తన పరిస్థితిని ఎయిర్ లైన్స్‌కు వివరించింది. దీంతో ఎయిర్‌లైన్స్ ఆమె పరిస్థితి అర్థం చేసుకుని మరో విమానంలో సీటు కేటాయించారు. ‘సిబ్బంది సహకారంతో తన తల్లి చివరి చూపుకు నోచుకున్నానంటూ హన్నా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఇది చూసిన నెటిజన్లు ఎయిర్ లైన్స్‌ను ప్రశంసిస్తున్నారు.