ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అద్భుతంగా రాణించి అందరి దృష్టిని ఆకర్షించిన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి స్వస్థలమైన విశాఖకు గురువారం చేరుకున్నాడు. విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. కుటుంబ సభ్యులు, అభిమానులు పూలమాలలు, పుష్పగుచ్ఛాలతో ముంచెత్తారు. పలువురు అభిమానులు ఆటోగ్రాఫ్‌లు, ఫొటోలు తీసుకున్నారు. విమానాశ్రయం నుంచి ఓపెన్ టాప్ వాహనంలో ఇంటికి ర్యాలీగా వెళ్లారు. నితీష్ శనివారం అకాడమిలో శిక్షణకు వెళ్లనున్నాడు. ఈనెల 22 నుంచి ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20లు, వన్డే మ్యాచ్‌లకు ఎంపికయ్యే అవకాశం ఉంది.